'కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఉద్యమాలు చేయక్కరలేదు'

Congress
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ పైన ఒత్తిడి తెస్తేనే తెలంగాణ తెస్తేనే తెలంగాణ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రజా సంఘాలు బుధవారం స్పష్టం చేశాయి. ఈ నెల 3వ తారీఖున జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా మంత్రి జానారెడ్డిని కలిసి వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పటికీ కాంగ్రెసు అధిష్టానంపై ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తే చాలన్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు.

భేటీకి జానారెడ్డిని ఆహ్వానించామని చెప్పారు. ఆయన వస్తానని చెప్పారన్నారు. 1969 నుండి కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉందన్నారు. తెలంగాణపై ఈ ప్రాంత కాంగ్రెసు పార్టీ కార్యాచరణ స్పష్టం చేయాలని కోరినట్టు చెప్పారు. కాగా తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన వైఖరి రాకుంటే అందరూ రాజీనామాలకు సిద్ధపడాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+