కేసులకు భయపడేది లేదు, ఎదుర్కుంటాను: జగన్

సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని, ప్రజలు మనవైపే ఉన్నారని ఆయన శాసనసభ్యులతో అన్నారు. కాంగ్రెసు మైండ్ గేమ్‌లో పడొద్దని ఆయన శాసనసభ్యులకు సూచించారు. సెప్టెంబర్ 5వ తేదీన మళ్లీ వైయస్ జగన్ తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశం కానున్నారు. రాజీనామాలు చేసిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు సెప్టెంబర్ 6వ తేదీన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరుతారు. అవసరమైతే గవర్నర్‌ను కూడా కలుస్తారు. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన తన వర్గం శాసనసభ్యులకు సూచించారు.
కాగా, తమ వైపు మరింత మంది శాసనసభ్యులు వస్తారని జగన్‌తో సమావేశానంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాజీనామాల సంఖ్య పెరుగుతుందని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 5వ తేదీన జరిగే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications