జగన్ ఎమ్మెల్యేలను చూసి సిగ్గు తెచ్చుకోవాలి: కెసిఆర్

బొగ్గు మన వద్ద ఉంటే కరెంట్ వాళ్లకు ఉందన్నారు. ఇలా వసతులు మన వద్ద ఉంటే సౌకర్యాలు వారు అనుభవిస్తున్నారని విమర్శించారు. తెలంగాణను ఆంధ్రా పెట్టుబడిదారులు నిత్యం దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతలకు తెలంగాణపై చిత్తశుద్ధి లేదన్నారు. అందుకే వారు రాజీనామాలకు ముందుకు రావడం లేదన్నారు. కాంగ్రెసు వాళ్లు రాజీనామాలు చేస్తే మేం చేస్తామని చెబుతూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత తెలంగాణపై మాట మార్చారన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా మాట మరిచి చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇప్పిస్తే చాలన్నారు.
తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు రావని తెలంగాణ వస్తుందన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను గెలిపించడానికి నేను ప్రజల కాళ్లు మొక్కుతానన్నారు. కాంగ్రెసు, టిడిపిలు రాజీనామాల పేరుతో నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ కోసం రాజీనామా చేయని ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా భారీగా ర్యాలీలు నిర్వహించాలని కోరారు. కాంగ్రెసు నేతలు రాజీనామా చేయకుండా ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications