రాజీనామా చేయని ఎమ్మెల్యేలే టార్గెట్: కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం చెప్పారు. వినాయక చవితి సందర్భంగా సకల జనుల సమ్మెను వాయిదా వేయాలని పలువురు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో టిజెఏసి సమావేశం అయింది. కార్యాచరణ రూపొందించుకున్న అనంతరం మీడియాతో చైర్మన్ కోదండరామ్ మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రభుత్వ పాలనను స్తంభింప జేస్తామని హెచ్చరించారు.

కార్యాచరణ రూపొందించుకున్నామని చెప్పారు. 13నుండి సకల జనుల సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పారు. 6వ తారీఖున అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యుల రాజీనామాలు డిమాండ్ చేస్తూ భారీగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 8న విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ర్యాలీ, 12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ, 13న సకల జనుల సమ్మె ఉధృతం, 14, 15వ తేదీల్లో సినిమా థియేటర్లు బందు చేసి రహదారులను దిగ్భందిస్తామని చెప్పారు.

17న జాతీయ రహదారుల దిగ్బంధం, 22న రైల్ రోక్, 25న కలెక్టరేట్‌ల ముట్టడి, ఆ తర్వాత అక్టోబర్‌లో చలో హైదరాబాద్ ఉంటుందని చెప్పారు. 9, 10, 11 తేదీల్లో గణేష్ నిమజ్జోనోత్సవం ఉండటంతో ఆ రోజుల్లో కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+