వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది: జగన్ వర్గం కొణతాల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konathala Ramakrishna
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమయిందని వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత కొణతాల రామకృష్ణ బుధవారం అన్నారు. తమ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉందన్నారు. దమ్ముంటే ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన జగన్ వర్గం శాసనసభ్యులు ఎవరూ కాంగ్రెసు వైపు వెళ్లరని స్పష్టం చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు సిబిఐ ఎఫ్ఐఆర్‌లో లేదంటున్న ముఖ్యమంత్రి మరోసారి ఎఫ్ఐఆర్‌ను చూడాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్సార్ పేరు ఎఫ్ఐఆర్‌లో లేదనడం హాస్యాస్పదం అని ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి వేరుగా అన్నారు. కాంగ్రెసు పెద్దలు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కేసులో కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెసును అధికారంలోకి తీసుకు వచ్చివ వైయస్సార్‌ పేరు ఎఫ్ఐఆర్‌లో పేర్కొనడంపై కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు.

వైయస్ సంక్షేమ పథకాలను నీరుగార్చుతున్న కాంగ్రెసుకు వైయస్సార్ వర్ధంతిని నిర్వహించే అర్హత ఉందా అని ఆమె ప్రశ్నించారు. కాగా అంతకుముందు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి రాజీనామా చేసిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు వచ్చారు.

English summary
Former minister Konathala Rama Krishna said today that count down started to state government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X