హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆధారాలు ఉంటేనే కేసు: జగన్‌పై ఈడి కేసులో నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్‌ఫోర్సు డైరెక్టరేట్(ఈఢి) వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బుధవారం హైదరాబాదులో అభిప్రాయపడ్డారు. చేసుకున్నంత వారికి చేసుకున్నంత మహదేవ అన్న రీతిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్పులు ఇప్పుడు బయట పడుతున్నాయని ఆయన అన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు రాజీనామాలు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి రాజీనామాలు అవినీతిని సమర్థించే విధంగా ఉన్నాయన్నారు. అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే రాజీనామాలు చేశారన్నారు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ జగన్‌కు పార్లమెంటులో మద్దతు పలుకుతుందన్నారు. అయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అంటూనే జగన్‌కు మద్దతు పలకడం శోచనీయం అన్నారు.

English summary
CPI state secretary Narayana said today that ED booked case against YS Jaganmohan Reddy with complete proofs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X