హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా గవర్నర్ బాధ్యతలు నిర్వహిస్తానని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య బుధవారం అన్నారు. సాయంత్రం గం.4.22 నిమిషాలకు తమిళనాడు గవర్నర్ రోశయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుండి చెన్నై బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకతీతంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు. కాగా రోశయ్య బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో వెళ్లారు. రోశయ్య విమానానికి ఎస్కార్టుగా మరో విమానం బయలుదేరి వెళ్లింది.