వైయస్ జగన్‌కు బిగుస్తున్న ఈడి ఉచ్చు?

ఈడి అధికారులు జగన్ కంపెనీలలోకి ఎక్కడి నుండి నిధులు మళ్లాయి? అవి ఎలా వచ్చాయి? పెట్టుబడులు పెట్టిన కంపెనీల వార్షిక ఆదాయం ఎలా ఉంది? అనే విషయాలను పరిశీలించి అనంతరం ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్ఐఆర్‌ను పరిశీలించిన అనంతరం ఎవరెవరికి నోటీసులు పంపాలనే నిర్ధారణకు వస్తుంది. అనంతరం గురువారం లేదా శుక్రవారం నుండి ఈడి నోటీసులు పంపే అవకాశం ఉంది.
కాగా ఇప్పటికే జగన్ ఆస్తుల కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో జగన్ పేరు మొదట ఉన్న విషయం తెలిసిందే. జగన్ తో సహా మరో 73 కంపెనీలు, వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఇక ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య పేరు మొదట ఉంది. ఆయనతో సహా మరో ఆరుగురి పేర్లు ఇందులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications