కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు రోజుల్లో కర్నూలులో 11 మంది పిల్లలు మృతి

|
Google Oneindia TeluguNews

Kurnool District
కర్నూలు: కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో రెండు రోజుల్లో 11 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే పిల్లలు మరణిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పిల్లలకు ఆక్సిజన్ సరిగా అందడం లేదని, దానివల్లనే పిల్లలు మరణిస్తున్నారని పిల్లల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే, ఆస్పత్రి సిబ్బంది ఆ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. అనారోగ్యం కారణంగానే పిల్లలు మరణించారని వారు చెబుతున్నారు.

కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో పిల్లల మృతిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే ప్రతిస్పందించారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దాలని మంత్రులు టిజి వెంకటేష్, శత్రుచర్ల విజయరామరాజు, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు సరిగా లేవనే మాట వినిపిస్తోంది.

English summary
Eleven children dead within two days in Kurnool government hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X