జగన్ సాక్షి డైలీకి ప్రభుత్వ ప్రకటనలపై సిబిఐ ఆరా

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి సిబిఐ అధికారులు బుధవారంనాడే కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై వివరణ కోరేందుకు సమాచార, పౌర సంబంధాల శాఖకు సిబిఐ శుక్రవారం నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. సాక్షి దినపత్రికకు పెద్ద యెత్తున ప్రకటనలు ఇవ్వడం వెనక ఎవైనా ఒత్తిళ్లు ఉన్నాయా అనే కోణం నుంచి దర్యాప్తు చేస్తున్నారు.
శుక్రవారం నుంచి వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు సిబిఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. సిబిఐ బుధవారం ఒక్క రోజే వందకు పైగా నోటీసులు జారీ చేసింది. వీరందరినీ దశలవారీగా పిలిచి విచారిస్తుంది. ప్రభుత్వం నుంచి కోరిన వివిధ శాఖలకు చెందిన రికార్డులు రెండు రోజుల్లో సిబిఐకి అందే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications