రామోజీ కోట రహస్యం, జగన్ సాక్షి డైలీ ధ్వజం

Ramoji Rao
హైదరాబాద్: ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీ రావుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక మరోసారి ధ్వజమెత్తింది. సాక్షి గ్రూపులో పెట్టుబడులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా సరే.. ఎవేవో వెతకడానికి ప్రయత్నిస్తూ నిత్యం బురద జల్లుతున్న రామోజీ తన విషయంలో ఎందుకింత గోప్యంగా ఉంటున్నారని సాక్షి దినపత్రిక ప్రశ్నించింది. ఈ మేరకు సాక్షి దినపత్రికలో శుక్రవారం ఈ మేరకు ఓ వార్తాకథనం ప్రచురితమైంది. తన గ్రూపులో 60.98 శాతం వాటా మాత్రమే తన చేతుల్లో ఉందని తప్పనిసరి పరిస్థితుల్లో కంపెనీల రిజిస్ట్రార్‌కు వెల్లడిస్తున్న రామోజీ ఆ మిగిలిన వాట ఎవరి చేతుల్లో ఉందో ఎందుకు చెప్పడం లేదని సాక్షి డైలీ అడిగింది. దాన్ని కొనుగోలు చేసిన వారు కూడా ఈనాడులో తమకు 40 శాతం ఉందంటూ ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించింది.

ఈనాడు గ్రూపులో 40 శాతం వాటా బయటివారిదేనని, ా బయటివారు ఈక్వేటర్ ట్రేడింగ్, అనూ ట్రేడింగులేనని, ముందుండి నడిపించింది నిమేష్ కంపానీ, వినయ్ ఛజ్‌లానీ కాగా, వెనక నుండి నడిపించింది అంబానీ - చంద్రబాబులేనని సాక్షి దినపత్రిక తన వార్తాకథనంలో వ్యాఖ్యానించింది. నెల రోజుల్లో పదుల కొద్దీ డొల్ల కంపెనీలు పుట్టుకొచ్చాయని, కోటి మూలధనం కూడా లేని కంపెనీల నుంచి వేల కోట్ల ప్రవాహం జరిగిందని, అంతటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కంపెనీలు చెప్పడం లేదని వివరించింది.

మార్గదర్శి కుంభకోణంలో రామోజీ రావు పీకల్లోతు కూరుకుపోయి తననెవరు బయటపడేస్తారా అని దిక్కులు చూస్తున్న సమయంలో దేశీయ దిగ్గజం రియలన్స్ ముందుకు వచ్చిందని, అది ముందుకు రావడం వెనక రహస్యమేమిటని సాక్షి పత్రిక వార్తాకథనంలో అన్నది. ఈనాడు గ్రూపులోకి పెట్టుబడులు ఎలా చేరాయనే విషయంపై సాక్షి దిన పత్రిక తన వార్తాకథంలో వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+