ఆధారాల మేరకే గాలి అరెస్టు: సిబిఐ జెడి లక్ష్మినారాయణ

గాలి జనార్దన్ రెడ్డిని విచారించి మరిన్ని వివరాలు రాబడుతామని ఆయన చెప్పారు. గాలి బ్రదర్స్‌ను విచారిస్తామని ఆయన అన్నారు. ఇంకా ఎవరినైనా అరెస్టు చేస్తారా అని అడిగితే తమకు లభించిన ఆధారాలను బట్టి ఎవరి మీదనైతే ఆధారాలుంటాయో వారిని అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. తాజా సమాచారం ఏమైనా ఉంటే తెలియజేస్తానని ఆయన అన్నారు. కాగా, బళ్లారిలోని గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు నివాసాల్లో కూడా సిబిఐ అధికారులు సోమవారం సోదాలు నిర్వహిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి బెంగళూర్ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications