బాబు ఆస్తులు రూ. 280 కోట్లు: ఆంధ్రజ్యోతి అంచనా

Chandrababu Naidu-Bhuvaneswari
హైదరాబాద్: తాను కొనుగోలు చేసినప్పటి విలువ ఆధారంగా తన అస్తుల మొత్తం విలువను ప్రకటించి విమర్శల పాలవుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఆదుకోవడానికి ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ముందుకు వచ్చింది. మార్కెట్ విలువ ప్రకారం ధరలు నిర్ణయించి చంద్రబాబు కుటుంబం ఆస్తుల మొత్తాన్ని వెల్లడించింది.

చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ మార్కెట్ ధర ప్రకారం రూ. 280 కోట్లు ఉంటుందని తేల్చింది. తన కుటుంబం మొత్తం ఆస్తులు కేవలం రూ.39 కోట్లేననీ చంద్రబాబు స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది.చంద్రబాబు ఆస్తులపై ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ విధంగా వివరించింది - భూములు, బంగారం, షేర్ల విలువను మదించేటప్పుడు ప్రస్తుత మార్కెట్ రేటునే పరిగణిస్తే.. బాబు కుటుంబం ఆస్తి దాదాపు పది రెట్లు పెరిగినట్లు కనిపిస్తోంది. దీని ప్రకారం ఆస్తి విలువ రూ.280 కోట్ల పైమాటే!

చంద్రబాబు ఆస్తి - జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 65లో తనకు 1125 గజాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉందని.. 2002 నాటికి దాని నిర్మాణం విలువ రూ.23 లక్షలని బాబు వెల్లడించారు. కానీ, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ ఇంటి విలువ ఎంత లేదన్నా తొమ్మిది కోట్లు ఉంటుంది. ఇక, 1993లో రూ.1.52 లక్షలతో కొన్న అంబాసిడర్ కారు విలువ ఇప్పుడు రూ.40 వేలు కూడా పలకకపోవచ్చు. బాబు ఆస్తుల విలువ రూ.39.88 లక్షలైతే.. వాటి మార్కెట్ విలువ ఎంత లేదన్నా తొమ్మిది కోట్ల 16 లక్షల 41 వేలు.

భువనేశ్వరి ఆస్తుల విలువ - కొన్న విలువ ప్రకారం చూసినా.. మార్కెట్ విలువ ప్రకారం చూసినా ఆస్తుల్లో బాబు సతీమణి భువనేశ్వరిదే పైచేయి. ఆమె పేరు మీద పంజాగుట్టలో 650 గజాల బిల్డింగ్ ఉంది. 1995లో దీని విలువ రూ.73.33 లక్షలు. కానీ ఇప్పుడా ఆస్తి విలువ రూ.13 కోట్లు దాకా ఉంటుంది. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్‌లో భువనేశ్వరికి 2.33 ఎకరాల స్థలంలో తాత్కాలిక వేర్‌హౌస్ ఉంది. 1996లో దీని విలువ రూ.1.86 కోట్లు కాగా ఇప్పుడు ఆ స్థలం విలువ రెండున్నర కోట్లపైమాటే. ఇక, శేరిలింగంపల్లి మదీనాగూడలో భువనేశ్వరికి ఉన్న ఐదెకరాల వ్యవసాయ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.50 కోట్లకు దరిదాపుల్లో ఉంటుంది.

ఇక హెరిటేజ్ ఫుడ్స్‌లో భువనేశ్వరి మెజారిటీ షేర్ హోల్డర్. కంపెనీలో ఆమెకు 26 లక్షల 65 వేల 413 షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో షేర్ విలువ రూ.175 పలుకుతోంది. మార్కెట్ ధర ప్రకారం వాటి విలువ రూ.47 కోట్లు. అన్‌లిస్టెడ్ కంపెనీల్లో ఆమెకు రూ.14.20 కోట్ల షేర్లు ఉన్నాయి. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో రూ.65.44 లక్షలు ఉన్నాయి.

ఇక, 2650 గ్రాముల విలువ చేసే ఆభరణాలు, వజ్రాలను రూ.26.96 లక్షలకు కొన్నారు. కానీ, ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ రెండు కోట్లకు చేరింది. అలాగే, 32.7 కిలోల వెండిని నాలుగున్నర ల క్షలకు కొంటే.. ప్రస్తుత విలువ రూ.22 లక్షలకు తక్కువ లేదు. ఇక, 2008లో రూ.92 లక్షలకు కొన్న ఆడి కారు ధర ప్రస్తుతం రూ.80 లక్షలకు పడిపోయి ఉంటుంది. రూ.12.38 కోట్ల అప్పులను తీసేస్తే.. బాబు ప్రకటన మేరకు భువనేశ్వరి ఆస్తుల విలు వ రూ.27.18 కోట్లు. కానీ, మార్కెట్ విలువను లెక్కిస్తే సుమారు రూ.119 కోట్లు!!

అలాగే లోకేశ్‌కు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 65లో భవనం ఉంది. 1285 గజాల్లోని ఈ ఇంటి విలువను రూ.2.36 కోట్లుగా ప్రకటించారు. కానీ, ఇప్పుడు దీని మార్కెట్ విలువ పది కోట్లు ఉంటుందని రియల్టర్లు చెబుతున్నారు. మదీనాగూడలోని లింగంపల్లి వద్ద ఆయనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిని పూర్వీకుల ఆస్తిగా చూపారు. ప్రస్తుతం దీని విలువ ఎంత లేదన్నా రూ.50 కోట్లు ఉంటుంది. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో 8.5 ఎకరాల భూమిని 2006లో రూ.59 లక్షలకు కొనుగోలు చేయగా... ఇప్పుడది రూ.25 కోట్లు పలుకుతోంది. కర్ణాటకలోని సర్జాపురాలో 3.17 ఎకరాల వ్యవసాయ భూమి రూ.8 కోట్లకు తక్కువేం కాదు.

క, హెరిటేజ్ ఫుడ్స్‌లో ఆయన వాటా రూ.20 కోట్లు పలుకుతోంది. అప్పు తీసేసి లోకేశ్ ఆస్తుల విలువను రూ.6.73 కోట్లుగా ప్రకటించారు. కానీ, వాటి మార్కెట్ విలువ సుమారు రూ.113.75 కోట్లు!! చంద్రబాబు కోడలు, బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణి విషయానికి వస్తే.. ఆమె పేరుపై మాదాపూర్‌లో 924 గజాల స్థలం ఉంది. 1996లో దానిని రూ.3.37 లక్షలకు కొన్నారు. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రెండున్నర కోట్ల వరకు ఉంది.

నందగిరి హిల్స్‌లో ఆమెకు 778 గజాల స్థలం, చెన్నైలో దాదాపు 5000 అడుగుల కమర్షియల్ స్పేస్, మణికొండలో 2440 గజాల స్థలం మార్కెట్ ధర అనూహ్యంగా పెరిగింది. 1290 గ్రాముల బంగారు ఆభరణాలు, వజ్రాలు, వెండి ధరలూ అంతే. చంద్రబాబు ప్రకటించిన ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ.38 లక్షలు అయితే.. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వాటి విలువ 52.76 కోట్లు. వీటినుంచి రూ.15 కోట్ల అప్పును తీసేసినా బ్రహ్మణి ఆస్తి రూ.37.39 కోట్లు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+