కిరణ్‌పై దామోదర రాజనర్సింహ కినుక, ఫిర్యాదుకు రెడీ

కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలికి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్‌గా కనుమూరి బాపిరాజు నియామకాన్ని తాజా ఉదాహరణగా చెబుతున్నారు. టిటిడి చైర్మన్‌గా మెదక్ జిల్లాకు చెందిన ముత్యంరెడ్డి పేరును సూచించాలని దామోదర రాజనర్సింహ అనుకున్నారని చెబుతున్నారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి టిటిడి చైర్మన్ నియామకంపై తనకు మాట మాత్రంగా చెప్పలేదని దామోదర రాజనర్సింహ తన సన్నిహితుల వద్ద అంటున్నారని సమాచారం. తాను రెండు, మూడు సార్లు కలిసినప్పటికీ టిటిడి పాలక మండలి చైర్మన్ పదవి భర్తీ గురించి తనకు చెప్పలేదని దామోదర రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications