తీవ్రవాదులకు ఢిల్లీ టార్గెట్‌గా మారింది: చిదంబరం

P Chidambaram
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టుపై దాడి ఉగ్రవాదుల చర్యేనని హోంమంత్రి చిదంబరం బుధవారం లోకసభలో ప్రకటించారు. దాడి జరిగిన ఇరవై నిమిషాల్లోనే అంబులెన్స్ పంపించామని చెప్పారు. ఢిల్లీలో హై అలెర్టు ప్రకటించామన్నారు. తీవ్రవాదులకు ఢిల్లీ టార్గెట్‌గా మారిందన్నారు. పేలుడులో తొమ్మిది మంది మృతి చెందగా 47 మంది గాయాలైనాయని ప్రకటించారు. పేలుళ్లను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. దేశ రాజధానిలో ఇలాంటి సంఘటనలు బాధాకరం అన్నారు. మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. ఢిల్లీని ఎప్పటి నుంచో తీవ్రవాదులు టార్గెట్ చేస్తున్నారని ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు అందజేస్తున్నామన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పేలుళ్లను ఆపలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది హృదయ విదారక సంఘటన అని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రవాదులు ఢిల్లీకి గురి పెట్టారన్నారు. దేశ రాజధానిలో వరుసగా ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. పేలుడుపై విచారణ త్వరితగతిన జరపాలన్నారు. పార్లమెంటుకు అతిసమీపంలో అదీ హైకోర్టు వద్ద పేలుడు జరగడం బాధాకరమన్నారు. పదేళ్ల క్రితం సెప్టెంబర్ 11న పేలుళ్లు జరిగాయని ఆ ఘటనకు దీనికి సంబంధం ఉండి ఉండవచ్చునని అద్వానీ అనుమానాలు వ్యక్తం చేశారు. తీవ్రవాద ఘటనలను ఆషామాషీగా తీసుకోరాదని ములాయం సింగ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+