వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారి తప్పిన ట్రెయిన్: పూరీ కాకుండా వరంగల్ చేరింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Train missed it's route
వరంగల్: రైలు దారి తప్పింది. పర్యాటకులతో కూడిన ప్రత్యేక రైలు ఒకటి పూరి వెళ్లాల్సి ఉండగా వరంగల్ చేరుకుంది. వినడానికి కాస్త హాస్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. కొంతమంది పర్యాటకులతో కూడిన ప్రత్యేక రైలు ఒకటి తిరుపతి నుండి పూరీకి బయలుదేరింది. అయితే ఆ రైలు వైజాగ్ నుండి పూరికి మరో మార్గంలో వెళ్లాల్సి ఉంది. కానీ అది వరంగల్ రూట్ పట్టింది. నేరుగా వరంగల్ చేరుకుంది. రైలు దారి తప్పింది ఏ ఒకటో రెండో కిలోమీటర్లు కాదు. వైజాగ్ నుండి వరంగల్ వరకు. అంటే సుమారు మూడు వందల కిలోమీటర్లకు పైగా. అంతదూరం నుండి రైలు దారి తప్పి వచ్చిందంటే రైల్వే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మూడు వందల కిలోమీటర్ల వరకు అధికారులు సిగ్నల్స్ ఎలా ఇచ్చారనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

వరంగల్ చేరిన తర్వాత అక్కడి అధికారులు దానిని గుర్తించి సికింద్రాబాద్‌కు సమాచారం అందించారు. దారి తప్పి వచ్చిన రైలును వరంగల్ అధికారులు తిప్పి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. దారి తప్పిన రైలులో వచ్చిన పర్యాటకులు మాత్రం రైల్వే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీడియా రైల్వే అధికారులను ప్రశ్నించగా మాట్లాడటం లేదని సమాచారం. సదరు ప్రత్యేక రైలు పూరీ మాత్రమే కాకుండా వరంగల్ మీదుగా మరో చోటకు వెళ్లాల్సి ఉందని మొదట ఇటు వైపు ప్రయాణంగా భావించి వరంగల్ వచ్చిందని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

English summary
Tirupati special train missed it's route today and it reached to Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X