వైయస్‌ జగన్‌ను పలకరించి, కౌగలించుకున్న కెవిపి

YS Jagan-KVP Ramachandar Rao
న్యూఢిల్లీ: వైయస్సార్ ప్రియమిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కౌగలించుకున్నారు. రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలో ఉన్నా కెవిపి రామచందర్ రావు ఎదురు పడలేదు. కానీ తిరిగి హైదరాబాదు తిరిగి వెళ్లే ముందు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. "ఎలా ఉన్నావు జగన్?'' అంటూ జగన్‌ను కెవిపి కుశల ప్రశ్న వేశారు. "బాగున్నాను.. మీరెలా ఉన్నా రు?'' అంటూ జగన్ కెవిపితో అన్నారు.

అలా ఒకర్నొకరు పలకరించుకుంటూనే ఇరువురూ ఒక క్షణం పాటు హత్తుకున్నారు. ఈ దృశ్యాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ఆశ్చర్యంతో తిలకిస్తూ ఉండిపోయారు. కాగా జగన్ సన్నిహితుడు, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి - తన భార్య ఆరోగ్యంపై డాక్టర్లను సంప్రదించడానికి బుధవారం రాత్రి అమెరికా బయలు దేరి వెళ్లారు. ఎంపీగా దౌత్యవేత్త పాస్‌పోర్ట్‌పై అమెరికా వెళుతున్నందు వల్ల తను రాజీనామా ఇప్పుడే చేస్తే ఈ పాస్‌పోర్ట్ రద్దవుతుందని భావించిన సబ్బం హరి.. రాజీనామా ప్రతిపాదనలు తిరిగి వచ్చే వరకు వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. అమెరికా వెళ్లే ముందు ఆయన దాదాపు అరగంటసేపు జగన్‌తో చర్చలు జరిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+