వైయస్ జపం పొలిటికల్ మార్కెటింగ్: జగన్‌పై పొన్నం

Poonam Prabhakar
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ దర్యాఫ్తుకు సహకరించి తన నిజాయితీ నిరూపించుకోవాలని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ గురువారం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని జగన్ పొలిటికల్ మార్కెట్ చేసుకుంటున్నారని విమర్శించారు. జగన్ కాంగ్రెసును విమర్శించకుండా నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. జగన్ కాంగ్రెసులో చేరనని చెబుతూనే కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఏలో చేరతానని చెబుతున్నారన్నారు. దీనిని బట్టే ఆయన మాటలలో నిబద్ధత ఎంతో అర్థమవుతోందన్నారు. బాన్సువాడ ఉప ఎన్నికలలో కాంగ్రెసు పోటీపై అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పారు. తెలంగాణ కాంగ్రెసు ప్రజా ప్రతినిధులం పార్లమెంటుకు గైర్హాజరై ప్రభుత్వానికి, పార్టీకి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలంగా తెలియజేశామన్నారు.

గతంలో మేం పార్లమెంటుకు హాజరైన సమావేశాలకు ఇప్పటి సమావేశాలకు తేడా స్పష్టంగా కనపిస్తోందన్నారు. ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, ఎంపీ సర్వే సత్యనారాయణ లాంటి వారికి తెలంగాణపై మాట్లాడే అవకాశం దొరికిందన్నారు. తెలంగాణ కోసం పార్టీలు అన్ని ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. తెలంగాణ కోసం పోరాటం చేసే విద్యార్థులను క్రిమినల్స్‌గా చిత్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న వాతావరణాన్ని అధిష్టానానికి తెలియజేస్తామన్నారు. తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతామని చెప్పారు. మంత్రులు, ఎంపీలకు మధ్య చిన్న చిన్న సమస్యలున్నా వ్యూహాత్మకంగా ముందుకెళతామన్నారు. రెండు రోజుల్లో తెలంగాణ కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+