వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ హత్యకు 'రిలయన్స్'కు లింక్: అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: రాష్ట్రంలో రిలయన్స్ దోపిడీని ప్రశ్నించినందుకే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో హత్య గావింపబడ్డారని తెలుగు ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని వైయస్సార్సీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం అన్నారు. 2007వ సంవత్సరంలో వైయస్సార్ కేంద్రానికి రాసిన లేఖలోని అంశాలనే కాగ్ ఇప్పుడు బయట పెట్టిందన్నారు. రిలయన్స్ అక్రమాలపై కేంద్రానికి వైయస్ లేఖ, కాగ్ నివేదికల నేపథ్యంలో వైయస్సార్ మరణం వెనుక కుట్ర ఉండి ఉంటుందని తెలుగు ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కోణంలో విచారణ జరిపితే వైయస్ మృతి మిస్టరీ విడుతుందన్నారు. అవినీతిపై పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిలయన్స్ అవినీతిపై ఎందుకు విచారణ జరపాలని అడగడం లేదని ప్రశ్నించారు.

రిలయన్స్, కెజి బేసిన్ దోపిడీపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రిలయన్స్ పైన సిబిఐ ఎంక్వయిరీ వేస్తే దొంగలెవరో తేలుతుందన్నారు. రిలయన్స్ రాష్ట్రాన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ చేస్తుంటే అప్పుడు ఓ ప్రధాన పత్రిక కనీసం ఒక్క చిన్న వార్త కూడా రాయలేదన్నారు. ఆ పత్రికలో రిలయన్స్‌ వాటాలు ఉన్నందు వల్లే వార్తలు ప్రచురించలేదని అర్థమవుతోందన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి, అక్రమాలపై బస్సుయాత్ర నిర్వహిస్తానని చెప్పడాన్ని అంబటి ఖండించారు. డిఎల్ బస్సుయాత్ర చేస్తే ప్రజలే బుద్ది చెబుతారన్నారు.

English summary
YSRC Party spokes person Ambati Rambabu accused that Reliance case may link with late YS Rajasekhar Reddy helicaptor accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X