తొలి తెలుగు ట్రావెల్ OTT వచ్చేస్తోంది..!
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రయాణాల పట్ల సరికొత్త అభిరుచిని పెంచిన ప్రముఖ ట్రావెల్ బ్రాండ్ 'విహారి', ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో సరికొత్త రికార్డు సృష్టించడానికి సిద్ధమైంది. ప్రపంచ చలనచిత్ర రంగానికి మకుటాయమానమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా 'విహారి OTT' గ్లోబల్ విజన్‌ను గ్రాండ్‌గా ఆవిష్కరించారు. ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' ఫేమ్, నటి శ్రీ సత్య చేతుల మీదుగా ఈ గ్లోబల్ విజన్ లోగో, పోస్టర్ లాంచ్ కావడం విశేషం. కాన్స్ ఫెస్టివల్‌లో విహారి టీమ్ విడుదల చేసిన ప్రత్యేక ప్రివ్యూ అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.
గడిచిన 18 ఏళ్లుగా విహారి సరిహద్దులు లేని ప్రయాణాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. బుల్లితెరపై ఒక ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన విహారి.. ప్రపంచంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు, వైవిధ్యమైన సంస్కృతులు, సాంప్రదాయాలు, నోరూరించే స్థానిక రుచులను తెలుగువారికి పరిచయం చేసింది. ఇప్పుడు అదే నమ్మకంతో, మరింత విస్తృతమైన కంటెంట్‌తో పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్‌గా మన ముందుకు రాబోతోంది.

కేవలం ప్రయాణాలు, పర్యాటక కథనాల కోసమే ప్రత్యేకించబడిన తెలుగులోనే మొట్టమొదటి OTT ప్లాట్‌ఫామ్ ఇది. కేవలం ఇండియాలోని టూరిస్ట్ ప్లేసెస్ మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్వేషించని అందాలను ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వీక్షించవచ్చు. హై-క్వాలిటీ విజువల్స్, ఆకట్టుకునే కథనాలతో ఇంట్లోనే కూర్చుని ప్రపంచాన్ని చుట్టేసిన ఫీలింగ్‌ను ప్రేక్షకులకు అందించనుంది.ట్రావెలింగ్ అనేది కేవలం ఒక ప్రదేశాన్ని చూడటం కాదు.. అదొక అనుభూతి. అలాంటి అనుభూతిని 18 ఏళ్లుగా అందిస్తున్న 'విహారి', ఇప్పుడు కాన్స్ వంటి అంతర్జాతీయ వేదికపై OTTగా రూపాంతరం చెందడం తెలుగు వారందరికీ గర్వకారణమని బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య చెప్పుకొచ్చారు.
ప్రయాణ ప్రియులకు, సరికొత్త కంటెంట్‌ను కోరుకునే డిజిటల్ ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ట్రీట్ ఇవ్వడానికి 'విహారి OTT' ఈ జూన్ నెలలో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. టెలివిజన్ రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన విహారి, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందో చూడాలి.












Click it and Unblock the Notifications