ఫ్యామిలీతో టూర్‌కెళ్తే ప్రభుత్వం జీతం.. దేశంలోనే ఫస్ట్ టైమ్

ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ కుటుంబంతో కలిసి హ్యాపీగా టూర్‌కు వెళ్లడం.. ఆ సమయాన్ని కూడా ఆఫీస్ పని (ఆన్ డ్యూటీ) గానే పరిగణించడం.. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం! బీహార్ రాష్ట్ర పర్యాటక రంగాన్ని, గ్రామీణ మౌలిక సదుపాయాలను సరికొత్తగా మార్చడం కోసం నితీష్ కుమార్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులు ప్రతి మూడు నెలలకోసారి తమ కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రంలోని ఏదైనా ఒక పర్యాటక, పర్యావరణ లేదా గ్రామీణ ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ కనీసం రెండు రోజులు (రెండు రాత్రులు) బస చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ టూర్ వ్యవధిని అధికారులు "విధి నిర్వహణ (On Duty)" లో గడిపినట్లుగానే పరిగణిస్తారు.

సాధారణ పరిపాలన విభాగం (GAD) అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి. రాజేందర్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వినూత్న పర్యటనలో శుక్రవారం, శనివారం రాత్రులు కచ్చితంగా స్థానిక ప్రాంతాల్లోనే గడపాలని, చుట్టుపక్కల కనీసం మూడు పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని నిబంధన విధించారు. అయితే, ఈ పర్యటనలకు ప్రభుత్వం ఒక కఠినమైన కండిషన్ పెట్టింది. ఈ టూర్‌లను అధికారిక పనులతో లేదా సైట్ తనిఖీలతో అస్సలు కలపకూడదు. "ఈ పర్యటన సమయంలో ఏ అధికారి కూడా ఎలాంటి అధికారిక సమీక్షా సమావేశాలు గానీ, ఆఫీస్ ఫైళ్ల తనిఖీలు గానీ నిర్వహించకూడదు" అని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేవలం పర్యాటకుడిలా వెళ్లి అక్కడి వాతావరణాన్ని అనుభవించడమే అధికారుల పని.

Bihar Govt Orders Officials To Take Family Tours Every Three Months Counting Stay As Official Duty Period

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకూ వర్తింపు.. కానీ ఒక ట్విస్ట్!

ఈ రూల్ రాష్ట్రంలోని అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, డివిజనల్ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు (DM), ఐపీఎస్, అటవీ శాఖ అధికారులతో సహా ఉన్నతాధికారులందరికీ వర్తిస్తుంది. అయితే, ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వంటి ఉన్నత స్థాయి అధికారులు తాము ప్రస్తుతం ఏ జిల్లాలో అయితే ఉద్యోగం చేస్తున్నారో.. ఆ జిల్లాను మినహాయించి, పక్కనే ఉన్న ఇతర జిల్లాల్లో ఈ రెండు రోజుల బసను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

15 రోజులకోసారి జీతం.. ప్రధాని సంచలన నిర్ణయం
15 రోజులకోసారి జీతం.. ప్రధాని సంచలన నిర్ణయం

టూర్ అయిపోయాక రిపోర్ట్ ఇవ్వాలి..

బీహార్ అంటే కేవలం గయ, బోధ్‌గయ, నలంద మాత్రమే కాదని.. ప్రపంచ వేదికపైకి రావలసిన ఎన్నో చారిత్రక, సాంస్కృతిక, పర్యావరణ ప్రాంతాలు రాష్ట్రంలో దాగి ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. అధికారులు తమ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత.. తాము సందర్శించిన ప్రాంతాల అందమైన ఫోటోలు, అక్కడి వసతుల సమాచారం, స్థానికంగా తాము పొందిన వ్యక్తిగత అనుభవాలతో కూడిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది.

2027లోనే కొత్త జీతాలు.. కానీ భారీగా 'అరియర్స్'!
2027లోనే కొత్త జీతాలు.. కానీ భారీగా 'అరియర్స్'!

హోమ్‌స్టేలకు భారీ ప్రమోషన్..

ఈ కార్యక్రమం ద్వారా పర్యాటక ప్రాంతాల్లో 'హోమ్‌స్టే' (Homestays) సంస్కృతిని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటకులు స్థానిక ఇళ్లలోనే డబ్బులు చెల్లించి బస చేయడం వల్ల.. వారికి ప్రామాణికమైన బీహారీ సంస్కృతి, స్థానిక వంటకాలు పరిచయమవుతాయి. తద్వారా స్థానిక ప్రజల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అధికారుల రాక పెరుగుతుంది కాబట్టి, జిల్లా వెబ్‌సైట్లలో ప్రభుత్వ అతిథి గృహాలు, ప్రైవేట్ హోటళ్లు, హోమ్‌స్టేల వివరాలను రేట్లతో సహా అప్‌లోడ్ చేయాలని జిల్లా యంత్రాంగాలను సర్కార్ ఆదేశించింది.

బీహార్ ప్రభుత్వం తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం వల్ల అధికారులకు మానసిక ఉల్లాసం కలగడమే కాకుండా.. వెలుగులోకి రాని ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు దేశానికి పరిచయమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+