హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు, చిరువర్గం ఎదురుచూపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఓ వైపు తెలంగాణ, మరోవైపు వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమస్యలు కాంగ్రెసు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నప్పటికీ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తెరపైకి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రివర్గంలో చాలామంది తనకు అనుకూలంగా లేక పోవడంతో తన మార్క్ ఉండేలా కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపట్ల అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 37 మంది మంత్రులలో ఆయనకు అనుకూలంగా కేవలం ఐదారుగురు మంత్రులకు మించి లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకు అనుకూలంగా ఉండే మంత్రివర్గాన్ని తయారు చేసుకోవాలని కిరణ్ భావిస్తున్నారట. అందుకోసం పాలన గాడి కన్నా ఆయన దృష్టి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు పైనే ఉందట. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో శుక్రవారం కిరణ్ ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గంపై చర్చించే అవకాశాలు లేనప్పటికీ మరోసారి వెళ్లినప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

మరోవైపు ఇటీవలే కాంగ్రెసు పార్టీలో తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన చిరంజీవి కూడా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగితే తమకు రెండు బెర్తులు వస్తాయనే ఆశతో ఉన్నారు. మంత్రివర్గంలో చిరు వర్గాన్ని చేర్పించుకునే ఆలోచన పలు కారణాల వల్ల ఆరు నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. విలీనం అధికారికంగా పూర్తయింది కాబట్టి ఇప్పటికైనా తమకు రెండు బెర్తులు వస్తాయనే ఆశతో చిరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రివర్గ మార్పులు జరిగితే తనకు హోంశాఖ కావాలని పట్టుతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ఉన్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు తన మనసులోని మాటను ఆయన అధిష్టానానికి నివేదించారట. దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, వట్టి వసంత్ కుమార్ తదితరులు తమ శాఖల పట్ల అసంతృప్తితో ఉన్నారు. తమకు ప్రాధాన్యత కలిగిన శాఖను అప్పగించాలని వారు బాధ్యతలు చేపట్టినప్పటి నుండే గళం వినిపిస్తున్నారు.

రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన శాఖ పట్ల అసంతృప్తితో ఉన్నప్పటికీ పిసిసి పదవి వరించడంతో ఆయన చల్లబడిపోయారు. మంత్రివర్గ మార్పులు ఎప్పుడు జరిగినా తెలంగాణ సెంటిమెంటును ముందు పెట్టి ప్రాధాన్యత కలిగిన శాఖలు, ఎక్కువ పదవులు తీసుకోవాలనే యోచనలో తెలంగాణ నేతలు ఉండగా, సీమాంధ్ర నేతలు కూడా మంత్రివర్గ మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఉద్వాసన పలికుతారనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తెలంగాణ నేతలు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బాన్సువాడ ఉప ఎన్నికలు, జగన్ వ్యవహారం దృష్ట్యా ఇప్పుడప్పుడే మంత్రివర్గ మార్పులు జరిగే అవకాశం లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి.

English summary
It seems, CM Kiran Kumar Reddy may reshuffle his cabinet soon. Tirupati mla Chiranjeevi team is expecting two minister posts in Kiran cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X