వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాన్సువాడపై చేతులు దులుపేసుకున్న చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: బాన్సువాడ ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతులు దులుపుకున్నారు. తెలంగాణపై టిడిపి రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రవచించడం, ప్రస్తుతం తెలంగాణ సెంటిమెంట్ బాగా ఉన్న దృష్ట్యా చంద్రబాబు బాన్సువాడ ఉప ఎన్నికలలో పోటీ చేసే అంశంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకే అప్పగించారు. ఉప ఎన్నికలలో పోటీ చేయాలా వద్దా అనే అంశాన్ని మీరే తేల్చుకోవాలని చెప్పి బాబు పక్కకు తప్పుకున్నారు. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేతలు పలువురు ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని బాబుకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలలో పోటీకి దిగకుండా తెలంగాణ కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసినందు వల్లనే పోటీకి దిగడం లేదని చెప్పాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అంతిమంగా నిర్ణయం తీసుకోనప్పటికీ పోటీ చేయకూడదనే నిర్ణయానికే దాదాపు అందరూ కట్టుబడి ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాగా అంతకుముందు సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ అందరూ రాజీనామాలు చేసి ఎన్నికలు బహిష్కరిస్తే తప్ప కేంద్రం తెలంగాణపై దిగి రాదన్నారు. తమ వ్యాఖ్యలపై స్పందించాల్సింది కెటి రామారావు కాదని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు అన్నారు. పార్టీలు జెండాలు పక్కన పెట్టి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే పోచారం పోటీకి దూరంగా ఉండాలని మరో ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేసారు. తెలంగాణ వచ్చాక పోచారంను బాన్సువాడ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా నిలబెడతామన్నారు.

తెలుగుదేశం పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా చేయడంతో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభా నియోజకవర్గానికి ఇసి ఉప ఎన్నికను ప్రకటించింది. శ్రీనివాస రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున పోటీ చేయనున్నారు. బాన్సువాడలో పోటీ చేసేందుకు కాంగ్రెసు పార్టీ సమాయత్తమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

English summary
TDP chief Chandrababu Naidu leaved decision to Telangana leaders on Bansuwada bypoll contest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X