వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నగారా సమితితో ముందుకొస్తున్న నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
మహబూబ్ నగర్: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నాగర్ కర్నూల్ సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి కొత్త వేదిక తెలంగాణ నగారా సమితిగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన నాగం జనార్ధన్ రెడ్డి శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల కొండల్లోని ఉమామహేశ్వర ఆలయంలో తెలంగాణ నగారా సమితి పేరుతో పూజలు చేశారు. దేవుడికి అభిషేకం నిర్వహించారు. ఈ పూజల్లో నాగంతో పాటు టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, వేణుగోపాల చారి పాల్గొన్నారు. నాగంకు మద్ధతుగా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, తెలంగాణవాదులు దేవాలయానికి వచ్చి పూజలో పాల్గొన్నారు.

కాగా గత కొంతకాలంగా తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఖరిపై నాగం జనార్ధన్ రెడ్డి అండ్ కో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సమయంలో తాను కొత్త పార్టీ లేదా కొత్త వేదిక ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అయితే తెలంగాణ నగారా సమితి పేరుతో పూజలు జరిపించడంతో ఆయన అదే పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. పూజలు చేసిన తర్వాత నాగం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ లక్ష్యంతోనే కొత్త వేదికను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ కోసం ఎన్ని వేదికలున్న మేము కూడా మా పోరాటం చేస్తామని చెప్పారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. గురువారం నుండే గ్రామాల్లోకి వెళతామన్నారు. ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళతామని చెప్పారు. అందరిని కలుపుకొని పోయి తెలంగాణ సాధిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు ఇంకా భ్రమలో ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం నిరంతరంగా పోరాడి సాధిస్తామన్నారు. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పక్షాలన్నీ ఏకం కావాలని కోరారు. తమ వేదికకు ఏయే పార్టీలు మద్దతునిస్తాయో వేచి చూస్తామని చెప్పారు.

English summary
MLA Nagam Janardhan Reddy make pooja with Telangana Nagara Samithi at Uma Maheswara temple at Nallamala forest of Mahaboob Nagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X