కిరణ్‌కు చిక్కులు, బాన్సువాడలో పోటీ వద్దని డిఎస్

తెలుగుదేశం పార్టీ దాదాపుగా చేతులెత్తేసినట్లే. బాన్సువాడలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి పోచారం శ్రీనివాస రెడ్డిపై డి. శ్రీనివాస్‌ను గానీ, షబ్బీర్ అలీని గానీ పోటీకి దించితే బాగుంటుందని కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. తమ అభిప్రాయాన్ని కాదని పార్టీ అభ్యర్థిని పోటీకి దించితే తాము మాత్రం పోటీ చేసే ప్రసక్తి లేదని వారిద్దరు ముఖ్యమంత్రికి కచ్చితంగానే చెప్పారని సమాచారం. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు పోటీకి దిగితేనే బాగుంటుందని తెరాస నాయకత్వం భావిస్తోంది. ఆ రెండు పార్టీల అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించడం ద్వారా తెలంగాణ వాదం సత్తాను చాటాలనేది తెరాస వ్యూహం.
గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస చేతిలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు చిత్తుగా ఓడిపోయాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ అనుభవాన్ని దృష్టి పెట్టుకుని బాన్సువాడలో పోటీ చేయకపోవడమే మంచిదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు అబిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications