కెవిపి ఇంటికి వెళ్లి తల్లిని పలకరించిన జగన్

YS Jagan
విజయవాడ‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం రాజ్యసభ సభ్యుడు, తన తండ్రి వైయస్సార్ ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావు నివాసానికి వెళ్లారు. కృష్ణా జిల్లా అంబాపురంలోని కెవిపి రామచందర్ రావు ఇంటికి వెళ్లి ఆయన తల్లి సీతాదేవిని పలకరించారు. వైయస్ జగన్ గత కొద్ది రోజులుగా కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఓదార్పు యాత్ర చేస్తూ ఆయన కెవిపి రామచందర్ రావు ఇంటికి వెళ్లారు.

కాగా, ఇటీవల ఢిల్లీలో కెవిపి రామచందర్ రావు వైయస్ జగన్‌ను పలకరించి యోగక్షేమాలు అడిగిన విషయం తెలిసిందే. ఎలా ఉన్నావు, జగన్ అంటూ కెవిపి రామచందర్ రావు ప్రశ్నించారు. కెవిపి రామచందర్ రావు వైయస్ జగన్‌తో వెళ్లకండా కాంగ్రెసు పార్టీతోనే ఉంటున్నారు. ఇటీవల విజయవాడలో పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆధ్వర్వంలో ఏర్పాటైన వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు కెవిపి రామచందర్ రావు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+