గాలిపై కేసుకు సిబిఐకి ఏడాది పట్టింది

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై కేసు పెట్టడానికి సిబిఐకి ఏడాది సమయం పట్టినట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సేకరించి కేసును పటిష్టంగా తయారు చేయడానికి సిబిఐ అంత సమయం తీసుకున్నట్లు చెబుతున్నారు. విచారణలో భాగంగా తమ కస్టడీలోకి తీసుకున్న గాలి జనార్దన్ రెడ్డిని, అతని బావ, ఓబుళాపురం మైనింగ్ కెంపెనీ (ఒఎంసి) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని వివిధ ప్రాంతాలకు తీసుకుని వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డిని బళ్లారి, ఓబుళాపురం ప్రాంతాలకు తీసుకుని వెళ్లి విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

కేసు దర్యాప్తు కీలకమైన దశలో ఉందని, ఈ స్థితిలో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తు దెబ్బ తింటుందని, గాలి జనార్దన్ రెడ్డి కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సిబిఐ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని సరైన సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేయడం కుదరదనే విషయం సిబిఐకి తెలుసు. బలమైన సాక్ష్యాలు ఉంటే తప్ప ఎఫ్ఐఆర్‌లో గానీ రిమాండ్ రిపోర్టులో గానీ గాలి జనార్దన్ రెడ్డి వంటి ప్రజాప్రతినిధి పేరు చేర్చడానికి వీలు కాదు. అలా చేస్తే ఎదురయ్యే ప్రమాదం ఏమిటో దర్యాప్తు సంస్థలకు తెలుసు. అందుకే బలమైన సాక్ష్యాధారాలను సేకరించడానికి సిబిఐ సమయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+