గాలి కోసం వైయస్సార్ బెదిరించారు: కల్లోల్ బిశ్వాస్

గాలి కోసం వైయస్సార్ చెప్పినట్టుగా తలాడించిన సీనియర్ అధికారులు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారన్నారు. గాలి గనుల్లో అనేక నిజాలు పూడుకు పోయాయన్నారు. మైనింగ్ అక్రమాలకు బయట పడతాయని సర్వే ఆఫ్ ఇండియా సర్వేను కూడా వైయస్ అడ్డుకున్నారన్నారు. సర్వేను వ్యతిరేకించారన్నారు. దీనిపై తాను కేంద్రానికి సైతం లేఖ రాశానన్నారు. మైనింగ్ ఎగుమతుల్లోనూ గోల్ మాల్ జరిగిందన్నారు. మైనింగ్ పైన అనుమానాలు రావటంతో తాను గ్రౌండ్ లెవల్లో పరిశోధన చేశానన్నారు. ఒఎంసి నుంచి ఆర్ఆర్ గ్లోబల్ లీజుకు తీసుకుందని దీనికి అటవీ శాఖ కూడా అనుమతులిచ్చిందన్నారు.
సన్ ఇన్ ఫ్రాను ఆర్ఆర్ గ్లోబల్ ఆక్రమించుకుందని ఆరోపించారు. కొందరు అధికారులు గాలి పర్మిట్ల కోసం సహకరించారన్నారు. గాలికి సహకరించిన మరికొందరు అధికారులు తనను ఇరికించే ప్రయత్నాలు కూడా చేశారన్నారు. అటవీ శాఖ ఉల్లంఘనల పైన నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. కొన్ని కంపెనీలపై వైయస్ స్వయంగా ఒత్తిడి తెచ్చిన సందర్భాలూ ఉన్నాయన్నారు. సిబిఐ తనను సాక్షిగా పేర్కొందన్నారు. సిబిఐ తనను విచారించిందన్నారు. సిబిఐ దర్యాఫ్తులో అన్నీ బయటపడతాయన్నారు.












Click it and Unblock the Notifications