వాస్తవాలతో జగన్‌కే నష్టం: పయ్యావుల కేశవ్

Payyavula Keshav
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి లేఖ వెనుక రాజకీయ కుట్ర ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ బుధవారం అనుమానం వ్యక్తం చేశారు. విజయ సాయి రెడ్డి వెల్లడించే వాస్తవాల వల్ల జగన్మోహన్ రెడ్డికే నష్టం అన్నారు. విజయ సాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నుండి ముప్పు ఉంటుందని తాను చెప్పలేదని కేవలం ప్రాణ భయం మాత్రమే ఉందని చెప్పానన్నారు. అయితే విజయ సాయి రెడ్డి మాత్రం జగన్ నుండి తనకు ప్రాణాపాయం ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పారన్నారు. లేఖ ద్వారా ఆయన మనసులోని మాట బయట పడిందన్నారు.

మొన్న జగన్ బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి, ఇవ్వాల విజయ సాయి రెడ్డి తనను అనవసరంగా తప్పుడు ఆరోపణలతో వివాదాల్లోకి లాగుతున్నారని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి, రాజా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పరిటాల రవి హత్య కేసులో నిందితులు, సాక్ష్యుల మృతి నేపథ్యంలో మాత్రమే తాను విజయ సాయి రెడ్డికి రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పారు. కల్లోల బిశ్వాస్‌కు కూడా రక్షణ కల్పించాలని పయ్యావుల కోరారు. కాగా తనకు రాజకీయంగా ముప్పు ఉందన్న లేఖ నేపథ్యంలో పోలీసులు విజయ సాయి రెడ్డికి వ్యక్తిగత భద్రత కల్పించింది. కాగా సిబిఐ ఎదుట విజయ సాయి రెడ్డి బుధవారం 12 రోజు కూడా హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+