కిచిడీ నుంచి గాలి జనార్దన్ రెడ్డికి కాస్తా ఊరట

హైదరాబాద్‌లోని కీలకమైన కోఠీలో సిబిఐ కార్యాలయం ఉంది. ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. వారికి చాపలు, బ్లాంకెట్స్ వంటి కనీస సౌకర్యాలను కల్పిస్తున్నారు. కస్టడీలో ఉన్నప్పుడు సందర్శకులను అనుమతించరు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు న్యాయవాదుల సమక్షంలో సిబిఐ అధికారులు వారిని విచారిస్తున్నారు. తమ ఇళ్లలో పంచభక్ష్య పరమాన్నాలు భుజించిన గాలి జనార్దన్ రెడ్డికి, శ్రీనివాస రెడ్డికి ఇప్పుడు లభిస్తున్న ఆహారం శిక్షలాంటిదేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications