ఇక కాంగ్రెసు, టిడిపి ప్రజాప్రతినిధులే టార్గెట్

మంగళవారం జెఏసి చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ సకల జనుల సమ్మె విజయవంతమైందని, ఇప్పటికైనా కాంగ్రెసు, టిడిపి ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని పిలుపునిచ్చారు. సమ్మె ఈ దశలో ఉన్న సమయంలోనే ప్రజా ప్రతినిధులపై రాజీనామా ఒత్తిడి తీసుకు రావాలని జెఏసి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలా అయితేనే వారు రాజీనామాలకు ముందుకు వస్తారని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. బుధ, గురువారం తెలంగాణ వ్యాప్తంగా సినిమా హాళ్ల బంద్, ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల మానవహారం, 16 నుండి ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె ఇలా వరుసగా జెఏసి కార్యాచరణ ప్రకటించింది. రోజు రోజుకు సమ్మెకు మద్దతు పెరుగుతుందని జెఏసి భావిస్తోంది. ఇలాంటి సమయంలోనే ప్రజా ప్రతినిధులపై రాజీనామా ఒత్తిడి తేవాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications