విజయసాయి రెడ్డికి మేమే రక్షణ కల్పిస్తాం: విహెచ్

బిజెపి నాయకులపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రతి యేటా బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి నిర్వహించే వరలక్ష్మీ వ్రతానికి వెళ్లి బిజెపి నేత సుష్మా స్వరాజ్ బహుమతులు స్వీకరించేవారని ఆయన ఆరోపించారు. సుష్మా స్వరాజ్ వ్యవహారంపై కూడా సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి గురించి తరుచుగా ఉపన్యాసాలు ఇచ్చే బిజెపి నాయకుడు వెంకయ్య నాయుడు రాష్ట్రంలోని అవినీతి గురించి ఎందుకు మాట్లాడడం లేదని, గాలి జనార్దన్ రెడ్డి విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ తన రథయాత్రను బళ్లారి నుంచి ప్రారంభించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications