గాలి జనార్దన్ రెడ్డి డ్రైవర్ ఇంట్లో సిబిఐ సోదాలు

కాగా, బళ్లారి తీసుకుని వెళ్లిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి రెండు లాకర్లను సిబిఐ అధికారులు తెరిచారు. బాళ్లారిలోని యాక్సిస్ బ్యాంకులో ఆ లాకర్లను తెరిచిన నగదును, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద నాలుగు లాకర్లు ఉన్నట్లు వారు గుర్తించారు. వాటిలో రెండింటిని మాత్రమే తెరిచారు. శ్రీనివాస రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఖాతాల నుంచి వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు.
కాగా, కర్ణాటక మాజీ మంత్రి, గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గాలి శ్రీరాములును కూడా సిబిఐ అధికారులు విచారిస్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీరాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్రమ గనుల కేసులో సిబిఐకి పూర్తిగా సహకరిస్తానని ఆయన చెప్పారు. అక్రమ గనుల కేసులో గాలి జనార్దన్ రెడ్డి దోషి కారని, నిందితుడు మాత్రమేనని ఆయన అన్నారు. తనది తప్పించుకుని తిరిగే మనస్తత్వం కాదని ఆయన అన్నారు. తనకు సిబిఐ నుంచి ఏ విధమైన నోటీసు కూడా అందలేదని ఆయన చెప్పారు. తన రాజీనామా డ్రామా కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications