జెఎసి నేతల చేతికి జైపాల్ యాదవ్ రాజీనామా లేఖ

Jaipal Yadav
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి తెలుగుదేశం శానససభ్యుడు జైపాల్ యాదవ్ తన రాజీనామా లేఖను తెలంగాణ జెఎసి నేతలకు ఇచ్చారు. హైడ్రామా మధ్య ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్‌లో రాసి జెఎసి నేతలకు ఇచ్చారు. కల్వకుర్తిలోని జైపాల్ యాదవ్ ఇంటిని ఉద్యోగులు, విద్యార్థుల సంఘాల జెఎసి నేతలు శనివారం జైపాల్ యాదవ్‌ను ముట్టడించారు. రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు. కొంత మంది జైపాల్ యాదవ్ కాళ్లు కూడా పట్టుకున్నారు. దీంతో ఆయన అక్కడికక్కడ రాజీనామా లేఖను రాసి వారికిచ్చారు.

జైపాల్ యాదవ్ నుంచి రాజీనామా లేఖను తీసుకున్న జెఎసి నేతలు కల్వకుర్తిలోని ఓ టెలిఫోన్ బూత్ నుంచి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫాక్స్ చేశారు. శుక్రవారం కూడా ఇటువంటి సంఘటనే మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిని తెలంగాణావాదులు అడ్డుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే కాగితంపై సంతకం చేసి రాజీనామా లేఖను వారి చేతికి ఇచ్చారు. తాము రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదించలేదని ఆయన చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ కాంగ్రెసు శాసనసభ్యుడు అబ్రహం శనివారం మరోసారి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం ఆయన తన రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+