హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ జిల్లాల్లో తెలంగాణ విమోచన ఉద్రిక్తం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాల విషయంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వరంగల్లులో తెలంగాణవాదులు పోలీసు హెడ్ క్వార్టర్‌పై జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులకు, తెలంగాణవాదులకు మధ్య తోపులాట జరిగింది. అలాగే, నిజామాబాద్ జిల్లాలోనూ ఉద్రిక్త వాతావరరణం చోటు చేసుకుంది.

నిజామాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో శాసనసభ్యుడు లక్ష్మినారాయణ నేతృత్వంలో బిజెపి కార్యకర్తలు జాతీయ పతాకను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. లక్ష్మినారాయణతో పాటు పలువురు బిజెపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌లో బిజెపి కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కాగా, హైదరాబాదులోని తమ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నాయని నర్సింహా రెడ్డి జాతీయ పతాకను ఆవిష్కరించారు. ప్రస్తుత పాలన కన్నా నిజాం పాలనే తమకు బాగుండేదని ఆయన అన్నారు. నిజాం ప్రజల కోసం పలు కార్యక్రమాలు చేపట్టారని ఆయన చెప్పారు. మంచినీటి సౌకర్యం కల్పించారని, రవాణా సౌకర్యాలు కల్పించారని ఆయన అన్నారు. ఆంధ్ర ఆధిపత్య వర్గాల పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.

English summary
Tension prevailed in few districts of Telangana during Telangana liberation day programs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X