పాపం పండింది: ఆంధ్రజ్యోతి ఎండిపై అంబటి రాంబాబు

రాధాకృష్ణపై అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరబాదులోని ఆబిడ్స్ స్ట్రింగర్‌గా 150 రూపాయల జీతంతో ప్రారంభించిన రాధాకృష్ణ కోట్ల రూపాయల విలువ చేసే మీడియా సంస్థకు ఎలా అధిపతి అయ్యాడని ఆయన ప్రశ్నించారు. రాధాకృష్ణ వృత్తి బ్రోకరిజమని, సంపాదనంతా బ్లాక్ మెయిల్ ద్వారా వచ్చిందేనని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాధాకృష్ణకు మినీ జల విద్యుత్ కేంద్రాన్ని ఎందుకు ఇచ్చారని ఆయన అడిగారు. స్వామీజీలను బెదిరించి కోట్లాది రూపాయలు రాధాకృష్ణ నొక్కేశాడని ఆయన ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గట్టు రామచంద్రరావు కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications