గాలి నోరు మెదప లేదు, అక్రమాలు జరిగాయి: సిబిఐ

నిందితుల నుండి బినామీ కంపెనీలు, ఖాతాల వివరాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు. మరింత సమాచారం వారి నుండి సేకరించాల్సి ఉందన్నారు. కాగా సోమవారంతో గాలి, శ్రీనివాస్ రెడ్డిల సిబిఐ కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారిని రెండు వారాల పాటు జ్యూడిషియల్ కస్టడీకి తరలించింది. కాగా వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విషయంలో వాన్ పిక్, మ్యాట్రిక్స్ కంపెనీల ప్రతినిధులు సిబిఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి పదహారో రోజు హాజరయ్యారు. ఆయనతో పాటు జగతి తరఫున మరో ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications