హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాఠీచార్జీ పేరుతో కాళ్లూ చేతులూ విరగ్గొట్టారు: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: లాఠీచార్జీ పేరుతో పోలీసులు విద్యార్థుల చేతులూ కాళ్లూ విరగ్గొట్టారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆరోపించారు. లాఠీచార్జీ పేరు మీద విద్యార్థుల కాళ్లూ చేతులూ విరగగొట్టడం ఏం న్యాయమని ఆయన అన్నారు. విద్యార్థులు ర్యాలీ తీయడానికి ప్రయత్నించడంతో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, నిజాం కళాశాల ఆవరణలు అట్టుడుకుతున్నాయి. గాయపడిన విద్యార్థులకు వైద్యం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, పోలీసు కమిషనర్ జోక్యం చేసుకుని అరెస్టయిన విద్యార్థులను విడిపించాలని ఆయన కోరారు.

నిజాం కళాశాల విద్యార్థుల పట్ల పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ నగారా నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. హరీశ్వర్ రెడ్డితో కలిసి ఆయన సోమవారం నిజాం కళాశాలకు వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. నిజాం కళాశాల విద్యార్థులను చితకబాది పోలీసులు అరెస్టు చేయడం ఏం న్యాయమని ఆయన అడిగారు. వైస్ చాన్సలర్, ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా పోలీసులు హాస్టళ్లలోకి ప్రవేశించడాన్ని ఆయన వ్యతిరేకించారు. దీనిపై తాము రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

English summary
TRS president K Chandrasekhar Rao condemned police lathicharge on Telangana students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X