వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేణుకా చౌదరిపై భగ్గుమన్న తెలంగాణ నాయకులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao and Kodandaram
హైదరాబాద్: తెలంగాణ సకల జనుల సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరిపై తెలంగాణ నాయకులు భగ్గుమన్నారు. ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేణుకా చౌదరి కళ్లు నెత్తికెక్కాయని, అటువంటప్పుడు చూడలేరు కదా అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు వినోద్ అన్నారు. సకల జనుల సమ్మె విజయవంతం కావడం ఓర్పలేక రేణుకా చౌదరి దబాయించి మాట్లాడుతున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కళ్లుండి చూడలేక రేణుకాచౌదరి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రేణుకా చౌదరి మాటలు మూర్ఖత్వానికి పరాకాష్ట అని ఆయన అన్నారు. రేణుకా చౌదరి మాటలకు సామాన్యులు కూడా నవ్వుతున్నారని ఆయన అన్నారు.

సకల జనుల సమ్మె విజయవంతం కాలేదని రేణుకా చౌదరి అనడం తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరచడమేనని తెరాస శానససభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణకు చెందినవారు కాకపోయినా రేణుకా చౌదరిని ఇక్కడ తెలంగాణ ప్రజలు గెలిపించారని, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని రేణుకా చౌదరి మాట్లాడాలని ఆయన అన్నారు. రేణుకా చౌదరిని నాయకురాలని చేసింది తెలంగాణ ప్రాంతమని ఆయన అన్నారు.

రేణుకా చౌదరి తెలంగాణలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మాటలు చెప్తే బాగుండేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ వ్యంగ్యంగా అన్నారు. సకల జనుల సమ్మెకు వ్యతిరేకంగా రేణుకా చౌదరి మాట్లాడడం శోచనీయమని ఆయన అన్నారు. తెలంగాణలోని ప్రస్తుత పరిణామాలకు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా రేపు ర్యాలీలు, ధర్నాలు ఉంటాయని ఆయన చెప్పారు.

English summary
Telangana leaders retaliated Congress leader Renuka Choudary's statement on Telangana strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X