తెలంగాణ సమ్మె ప్రభావం కేంద్రంపై ఉండదు: సిఎం

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ సకల జనుల సమ్మె వల్ల ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎక్కువ పంపుసెట్లు తెలంగాణలోనే ఉన్నాయని, సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిపేయడం వల్ల విద్యుత్ కొరత ఏర్పడిందని, ఇప్పటికే కోత విధిస్తున్నామని, హైదరాబాదులో కూడా రెండు గంటల పాటు కోత విధించాల్సి వస్తుందని, అత్యవసర సర్వీసులను సమ్మె నుంచి మినహాయించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ సకల జనుల సమ్మెపై ఆయన మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు విద్యుత్తు కోరుతున్నామని ఆయన చెప్పారు. బొగ్గును కూడా పొరుగు ప్రాంతాల నుంచి కోరుతున్నామని ఆయన అన్నారు. సమ్మె కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేదని, చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

సమ్మె ద్వారా బొగ్గు ఉత్పత్తిని నిలిపేయడాన్ని ఆయన ఖండించారు. కొంత మంది సింగరేణి కార్మికులు పనిచేస్తుంటే వారిని కూడా ఆపించడానికి బస్సులో వెళ్తున్నారని, ఇది సరి కాదని ఆయన అన్నారు. సమ్మె వల్ల పోటీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థులకు నష్టం వాటిల్లుతోందని, తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు భయపడుతున్నారని ఆయన అన్నారు. బస్సులను ఆపడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై ఆందోళనకారులు ఆలోచించాలని ఆయన అన్నారు. బయటి ప్రాంతాలవారికి ఇబ్బందులు కలుగుతున్నా ఎక్కువగా తెలంగాణ ప్రజలకే ఇబ్బంది కలుగుతోందని ఆయన అన్నారు. సమ్మెను వెంటనే విరమించుకోవడం మంచిదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు ఇప్పటికే కేంద్రానికి చేరాయని, సమ్మె వల్ల కొత్తగా చెప్పేదేమీ లేదని ఆయన అన్నారు.

సమ్మె వల్ల సంక్షేమ పథకాలకు ఆటంకం కలుగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందని ఆయన అన్నారు. తమ కాంగ్రెసు పార్టీ ఇప్పటికే చర్చలు జరుపుతోందని, త్వరలో చర్చలు ముగుస్తాయని గులాం నబీ ఆజాద్ చెప్పారని ఆయన అన్నారు. కేంద్రం తెలంగాణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయడానికి ప్రయత్నించినప్పుడు అందుకు ఆయన నిరాకరించారు. తాను మీడియా ప్రతినిధుల ప్రశ్నలను ఆహ్వానించదలుచుకోలేదని, విజ్ఞప్తి చేయడానికి మాత్రమే తాను మాట్లాడానని ఆయన చెప్పారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలను ఆహ్వానిస్తే తాను చెప్పే మాటల వల్ల పెడర్థాలకు దారి తీసే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+