కేసుల సమీక్ష, హైదరాబాదులో సిబిఐ డైరెక్టర్

కాగా, గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాల కేసులో మైనింగ్ వ్యాపారి శశికుమార్ గురువారం సిబిఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆయన కోఠీలోని సిబిఐ కార్యాలయంలో అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. తనకు అనుమతి లభించే సమయంలో గాలి అక్రమాలకు పాల్పడి అనుమతులు దక్కించుకున్నారని ఆయన ఆరోపించారు. గాలి అక్రమాలకు సంబంధించి ఆయన సిబిఐ అధికారులకు పత్రాలు సమర్పించినట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు స్వస్తిక్ నాగరాజు కూడా గురువారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యాడు. గత కొంత కాలంగా అతను అజ్ఞాతంలో ఉన్నాడు. నాగరాజు నివాసంలో సిబిఐ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తమ ముందు హాజరు కావాలని సిబిఐ అతనికి నోటీసు కూడా జారీ చేసింది.












Click it and Unblock the Notifications