తెలంగాణపై సోనియా గాంధీది నాన్చుడు ధోరణే

సోనియా గాంధీ మనుసెరిగినందు వల్లనే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నోరు విప్పడం లేదని అంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అప్పట్లో జైపాల్ రెడ్డి నిర్మొహమాటంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత ఏ మాత్రం మాట్లాడడం లేదు. అయితే, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి పార్లమెంటు సభ్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తాము గోతిలో పడ్డామని, బయటపడడానికి పార్టీ చేయూత అందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే, సకలర జనుల సమ్మె వంటి ఆందోళనా కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందనే ఆశ తెలంగాణ నాయకుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది.
కాగా, తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కె. కేశవరావు, పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని వారు హైదరాబాదులో ఆయనను కోరారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ఇచ్చిన గడువులోగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని లేఖ ఇవ్వాలని వారు ఆయనను కోరారు. అయితే, పిసిసి పగ్గాలు చేపట్టిన బొత్స సత్యనారాయణ మాత్రం తెలంగాణపై త్వరలో నిర్ణయం వెలువడుతుందంటూ చెప్పుకుని తిరుగుతున్నారు. కాంగ్రెసు పార్టీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితి మాత్రం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications