గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సకల జనుల సమ్మెలో భాగంగా తెలంగాణవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం అవుతున్న ఈ సమయంలో గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయాలంటూ తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు గురువారం ముఖ్యమంత్రిని కలిసి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే అది మన చేతుల్లో లేదని తేల్చి చెప్పారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ నేతలు గ్రూప్ వన్ వాయిదా బాధ్యతలు మంత్రులపై వేశారు. కాగా పరీక్షలకు విద్యార్థులు సిద్ధంగా లేరని ఒకవేళ విద్యార్థులు సిద్ధంగా ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేవని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం అన్నారు. ఈ విషయమై ఎపిపిఎస్సీ చైర్మన్‌ను కలుస్తామన్నారు. పరీక్షలు నిర్వహిస్తే ముఖ్యమంత్రిని తెలంగాణ వ్యతిరేకిగా చూడాల్సి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications