జగన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 15వ తేదీన తాము పోలీసులకు దరఖాస్తు చేసుకోగా 17 నుంచి 21వ తే దీ వరకు రిలే నిరాహార దీక్షలు చేసుకోవడానికి ఆ రోజే అనుమతి ఇచ్చారని సుదమల్ల వెంకటస్వామి గురువారం రాత్రి మీడియా ప్రతినిధులకు తెలిపారు. 17వ తేదీ నుంచి 19 వరకు దీక్షలు సజావుగానే సాగాయని, 18వ తేదిన 'ఫీజు ఫోరు' నిమిత్తం ఒకరోజు అనుమతి తీసుకున్న జగన్ ఇందిరాపార్కు వద్ద దీక్ష చేశారని తెలిపారు. ఆ సమయంలో జగన్ దీక్షకు వచ్చిన తెలంగాణవాదులు తమకు మద్దతు తెలపడాన్ని ఓర్వలేక 20వ తేదీ ఉదయం కల్లా తమ టెంట్‌ను తొలగించారని చెప్పారు.
తాను, తమ పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబును అడిగితే - "మీది ఒకపార్టీనేరా, పోరాపో'' అంటూ కులంపేరుతో దూషించారని, అంతలోనే శిబిరంలో ఉన్న జగన్‌కూడా "ఎవడ్రా అది అక్కడి నుంచి పంపించేయండి'' అంటూ దురుసుగా ప్రవర్తించి దూషించారని వివరించారు. దీనిపై సుదమల్ల వెంకటస్వామి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆ పార్టీ వేసుకున్న టెంట్‌ను తొలగించడం, కులంపేరుతో దూషించడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని హైకోర్టు గాంధీనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications