ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తెలంగాణవాదులు

హైదరాబాదు పరిసర శేరిలింగపల్లి శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్ ఇంటిని తెలంగాణ వాదులు ముట్టడించి రాజీనామాకు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే ఎల్ రమణ దీక్షకు వెళుతున్న రెండు బస్సులపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. అనంతరం ఆయన దీక్షా శిబిరంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు ర్యాలీని తెలంగాణవాదులు అడ్డుకొని ఆయన కారు అద్దాలు పగులగొట్టారు. అదిలాబాదులో ఓ యువకుడు సెట్ టవర్‌ల పైకి ఎక్కి టిటిడిపి దీక్షలు మానుకోవాలని హెచ్చరించారు. పలుచోట్ల టిఆర్ఎస్, టిడిపి వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు పలువురు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లాలో ఎంపీ నాగేశ్వర రావు తదితరులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఇలాంటి దాడులు సరికాదన్నారు. ఆర్మూరులో ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ దీక్షను అడ్డుకున్నారు. డిచ్‌పల్లిలో టిడిపి నేత మండవ వెంకటేశ్వర రావు దీక్షను తెలంగాణవాదులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఇందులో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాబాద్‌లో టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ఫ్లక్సీలను ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications