నేపాల్‌లో విమానం కూలి 10మంది భారతీయులు మృతి

Nepal Map
ఖాట్మాండ్: నేపాల్‌లో ఆదివారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది యాత్రికులు, ముగ్గురు సిబ్బంది మొత్తం పంతొమ్మిది మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో మన దేశానికి చెందిన వారు పది మంది ఉన్నారు. బుద్ద ఎయిర్ లైన్స్‌కు చెందిన ఈ విమానం చివరిసారి ఖాట్మాండుకు సమీపంలోని సెంట్రల్ నేపాల్ వద్ద ఆచూకి గల్లంతయినట్లుగా సమాచారం. ఆ తర్వాత దాని ఆచూకి లేదు. ప్రమాద స్థలి ఖాట్మాండుకు పదికిలోమీటర్ల దూరం ఉంటుంది.

ఇందులో ఉన్న పదహారు మంది యాత్రికులు విదేశీయులే. ఉదయం ఏడున్నర గంటలకు ప్రమాదం జరిగింది. ఖాట్మాండు నుండి తులింగ్ వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులు ఎవరెస్టు శిఖరాన్ని చూసి వస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+