2జి స్కామ్‌లో చిదంబరాన్ని ఇరికిస్తున్న రాజా

చిదంబరం వాంగ్మూలాన్ని 2010 సెప్టెంబర్‌లోనే తీసుకోవాల్సి ఉండిందని ఆయన అన్నారు. చిదంబరం, రాజాల మధ్య ఏ విధమైన భేదాభిప్రాయం లేదని, కేటాయింపుల నిర్ణయం మంత్రివర్గం తీసుకున్నదని, అందువల్ల మంత్రివర్గంపై విచారణ జరగాలని ఆయన అన్నారు. చిదంబరాన్ని సాక్షికి కోర్టుకు పిలవాలని ఆయన కోరారు. ప్రధాని సమక్షంలో చిదంబరం సలహా ఇచ్చారా లేదా అనేది కోర్టు తేల్చాలని ఆయన అన్నారు.
నిందితులందరికీ జైలు శిక్ష విధించాలని కోరుతూ సిబిఐ 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఐ అంతకు ముందు తాజా అభియోగాలు మోపింది. నిందితులకు అత్యధికంగా ఏడేళ్లు జైలు శిక్ష పడేలా సిబిఐ అభియోగాలు మోపింది.












Click it and Unblock the Notifications