తెలంగాణపై మేం చెప్పాల్సింది చెప్పాం: చంద్రబాబు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసమర్థంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. మంత్రులకు, ముఖ్యమంత్రికి మధ్య పడడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన లీజు గడువు ముగిసిందని భావిస్తున్నారని, దాన్ని పొడగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు పరస్పరం విమర్శించుకుంటూ అధికారం కోసం పాకులాడుతున్నారు తప్ప ప్రజాసమస్యలపై ఆలోచించడం లేదని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి స్వార్థంతో తన స్వలాభం కోసం మాత్రమే పనిచేశారని ఆయన అన్నారు. ప్రజలు సమస్యల్లో ఉన్నారని, వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని, అందుకు గాను నవంబర్ 1వ తేదీ నుంచి జనచైతన్య యాత్రల పేరిట ప్రజల్లోకి వెళ్లాలని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications