32 మంది తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేల రాజీనామా

Telangana Map
హైదరాబాద్: తీవ్ర తర్జనభర్జనల తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన 32 మంది తెలంగాణ శాసనసభ్యులు బుధవారం సాయంత్రం రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను వారు శానససభ సచివాలయ కార్యదర్శికి సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే వారు రాజీనామా లేఖలు సమర్పించారు. బుధవారం ఉదయం పది గంటలకు శాసనసభకు చేరుకున్న తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యులు సాయంత్రం రాజీనామాలు చేశారు. తాము రాజీనామాలు చేయడానికి పది గంటలకు శాసనసభకు వస్తున్నామని, కాంగ్రెసు శాసనసభ్యులు కూడా రావాలని వారంటూ వచ్చారు.

కాంగ్రెసు శాసనసభ్యులు తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యుల సవాల్‌ను అసలు పట్టించుకోలేదు. దీంతో తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు మల్లగుల్లాలు పడ్డారు. దాదాపు సగం మంది కాంగ్రెసుతో సంబంధం లేకుండా రాజీనామాలు చేద్దామని ప్రతిపాదించకుండా మిగతా వారు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అయితే, చివరకు ఏకాభిప్రాయం కుదిరి రాజీనామాలకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. వారు రాజీనామాలు చేసే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. రాజీనామాలపై తొందర పడవద్దని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అప్పటికే వారు రాజీనామాలు చేసినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+