చంద్రబాబు అమ్ముడుపోయారు: వైయస్ జగన్ దాడి

మంగళవారం విజయవాడలో ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కుళ్లు, కుతంత్రాలే రాజకీయంగా, కళ్లార్పకుండా వంద అబద్ధాలనైనా చెప్పగలిగే చాతుర్యం, పదవి కోసం మామను కూడా వెన్నుపోటు పొడిచారన్న సందర్భాల్లో మనకు గుర్తుకు వచ్చే పేరు చంద్రబాబు అని ఆయన అన్నారు. వైయస్ చనిపోయాక రాష్ట్రం పరిస్థితి చూస్తే బాధేస్తోందని ఆయన అన్నారు. వరి వేసుకోవడం కన్నా ఉరి వేసుకోవడం నయమని రైతు అంటున్నాడని ఆయన అన్నారు. 108 సేవల తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా ఈ నెల 1వ తేదీన తలపెట్టిన ధర్నాకు తరలి రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications